భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియాకు 31వ ఆర్మీ చీఫ్. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన జనరల్ ఉపేంద్ర ద్వివేది రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ నియామకయ్యారు. ఆయన బలమైన, స్వయం సమృద్ధి కలిగిన 1.3 మిలియన్ల భారత ఆర్మీకి నాయకత్వం వహిస్తారు. మహారాష్ట్ర, పూనేలోని ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన జనరల్ ధీరజ్ సేథ్ 1986 డిసెంబర్లో భారత ఆర్మీలో చేరారు. ఇంతకుందు ఆయన ఆర్మీ స్టాఫ్‌కు వైస్ చీఫ్‌గా పని చేశారు. అలాగే సౌత్ కమాండ్‌కు, జైపూర్‌లోని సౌత్ వెస్టర్న్ కమాండ్‌కు నేతృత్వం వహించారు. రెండు ఆపరేషనల్ ఆర్మీ కమాండ్స్‌ను నడిపించిన కమాండర్లలో ఆయన కూడా ఒకరు.
దాదాపు 40 ఏళ్లుగా ఆర్మీలో వివిధ హోదాల్లో సేవలందిస్తూ, అనేక ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. భారత ఆర్మీని ఆధునీకరించడంలో ధీరజ్ సేథ్ కీలక పాత్ర పోషించారు. వ్యూహాత్మక ప్రణాళికలు, సైనిక దళాల నిర్మాణం, సామర్ధ్యాల పెంపు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, మౌలిక వసతులు వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించారు.

































