My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra

కాకినాడలో విద్యుత్ షాక్ ఘటన

వాలీబాల్ పోల్ వేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కారణంగా ఒక యువకుడు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు; దానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంలు స్పందించారు.

గణపతి నవరాత్రోత్సవాల తొలి రోజే ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండగ వేళ.. ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. వారిలో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు యువకుల పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

వినాయక చవితి పండగ సందర్భంగా.. కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో.. ఆడుకోవడానికి వెళ్లిన యువకులకు ఊహించని షాక్ తగిలింది. విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు మృతి చెందగా.. మరో ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు.. పోల్‌ నిలబెడుతున్న ఆరుగురు యువకులకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటన కాస్తా.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. దీంతో స్పందించిన పవన్.. సంతాపం తెలిపారు.

ఇక విద్యుత్ షాక్ తగిలిన ఘటనలో ఏడిద చరణ్ అనే 19 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా మారడంతో వారిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. మూలపేట గ్రామంలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వాలీబాల్ ఆడుకునేందుకు పోల్‌లు నిలబెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు.. దాని వల్ల ఏడిద చరణ్ అనే యువకుడు చనిపోయినట్లు తనకు తెలిసి చింతిస్తున్నట్లు చెప్పారు.

ఏడిద చరణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుని భరోసా ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే ప్రమాదంలో మరో ఆరుగురు యువకులు గాయపడినట్లు అధికారులు చెప్పారని.. వారికి మెరుగైన ట్రీట్‌మెంట్ అందించాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *

    About Us

    My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

    Email Us: info@mytelugunri.com

    Contact: 9123456789

    About Us

    My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

    Contact us

    Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

    Email: editor.mytelugunri@gmail.com

    Contact: +91-7893860141

    US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

    Email: support@mytelugunri.com

    Advertise with us

      My Telugu NRI  @2025. All Rights Reserved.