తమిళ నటుడు శివకార్తికేయన్ పై ప్రశంసల వర్షం కురిపించారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం మదరాసి ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ని సొంతం చేసుకుంది.

అయితే తాజాగా ఈ సినిమాను వీక్షించిన రజనీకాంత్ చిత్రబృందాన్ని, ముఖ్యంగా శివకార్తికేయన్ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా, విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు.

