My Telugu NRI

Mobile Scrollable Menu
- Health

హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ! అసలు ఎప్పుడు తీసుకోవాలి.. కవరేజీ ఎంతుండాలి?

ఈ రోజుల్లో ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికీ అవసరమనే అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రాధాన్యం మరింతగా పెరిగింది. వైద్య ఖర్చులను తగ్గించడమే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఎత్తివేస్తారన్న చర్చలు జరుగుతున్నాయి. ఇక అసలు ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం

ఆరోగ్య బీమా అనేది ఈ రోజుల్లో తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ముఖ్యంగా కొవిడ్ తర్వాతి కాలంలో దీని గురించి అవగాహన పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్‌తో వైద్య ఖర్చులు భారీగా తగ్గుతాయని చెప్పొచ్చు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్య బీమాపై జీఎస్టీ ఎత్తేస్తున్నారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు ఆరోగ్య బీమా ఎంతకు తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి.. వంటి వివరాలు చూద్దాం.

ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ పోతుంటుంది. ఈ క్రమంలోనే మన ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ముఖ్యంగా వైద్య ఖర్చులు భరించలేని స్థాయిలో ఉంటాయి. అందుకే అందరికీ ఆరోగ్య బీమా ఉండాలనే అభిప్రాయం కలుగుతోంది. కరోనా తర్వాతి కాలంలో దీని అవసరం ఇంకా తెలిసొచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది.. వైద్య ఖర్చుల్ని భారీగా తగ్గిస్తుంది. మనకు ఎంతో ఆదా చేస్తుందని చెప్పొచ్చు. దీంతో అత్యవసర సమయాల్లో కుటుంబానికి అండగా నిలుస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్ల వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అందుకే.. ప్రతి ఒక్కరూ తమ స్థోమతకు తగ్గట్లుగా తగినంత ఆరోగ్య బీమా కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మీరు ఇక్కడ ఎంత పాలసీ తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి.. వంటి విషయాలపై కాస్త అవగాహన పెంపొందించుకోవాలి. ఈ వివరాల్ని చూద్దాం.

కుటుంబంలో నలుగురైదుగురు ఉన్నట్లయితే.. అక్కడ బీమా కవరేజీ మొత్తం కుటుంబ పెద్ద (సంపాదించే వ్యక్తి) వార్షిక వేతనానికి సమానంగా ఉండాలి. లేకపోతే కనీసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. తక్కువ ఆదాయం ఉన్న వారు కూడా.. ప్రస్తుత వైద్య ఖర్చుల నేపథ్యంలో కనీసం రూ. 5 లక్షల కవరేజీ ఉండే పాలసీ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Where can I get some?

>> మీరు ఇన్సూరెన్స్ కవరేజీపై నిర్ణయం తీసుకునేముందు.. బీమా కొనుగోలు చేసే వ్యక్తి వయసును కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా సీనియర్ సిటిజెన్స్‌కు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి తగినంత మొత్తంతో పాలసీ తీసుకోవాలి. సీనియర్ సిటిజెన్లకు ప్రీమియం కాస్త ఎక్కువే ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.