నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఘొక విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.ఈ ఘోర విషాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్పవార్తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత లేదు. బీజేపీతో ఉండగానే ఇలా జరిగిందని, ఇక ప్రతిపక్ష పార్టీల గతి ఏమిటో అర్థం కాదని ఆమె విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇతర ఏ ఏజెన్సీపైనా తమకు నమ్మకం లేదని మమత వ్యాఖ్యానించారు.


