రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలు. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ డైరెక్టర్ కిషోర్ తిరుమల కథ చెప్పినప్పుడే ఇందులో మోడ్రన్ గర్ల్ పాత్ర చేయాలని అనుకున్నాను. ఆయన కూడా అదే పాత్రకి అనుకున్నానని చెప్పారు. నా సామిరంగతో పోల్చుకుంటే ఇది పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్. ఖచ్చితంగా నా కెరీర్ లో చాలా కొత్తగా ఉంటుంది. -ఇందులో నా పాత్ర పేరు మానస శెట్టి. రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. అందులోనూ నాకు తెలుగు అంతగా రాదు. అయితే డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారు.
ఆయన నా క్యారెక్టర్‌ను చాలా అందంగా చూపించారు. సినిమాలో రవితేజ ఫన్, ఎమోషన్‌ను అద్భుతంగా పండించారు. ఆయనతో కలసి పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. డింపుల్ హయతి మాట్లాడుతూ ఈ సినిమాలో డైరెక్టర్ బాలామణి పాత్ర కోసం నన్ను తీసుకోవడం ఆనందంగా అనిపించింది. రవితేజతో ఇది నా రెండో సినిమా. ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. డైరెక్టర్ కిషోర్ నా క్యారెక్టర్‌ను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బాలామణి పాత్రలో కనిపించడం కొత్త అనుభవాన్నిచ్చింది. ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్ వుంది. అది సినిమాలోనే చూడాలి. డైలాగ్స్ చాలా యునిక్‌గా వుంటాయి. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలిపారు.


