భారత్-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు. యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో లూయిస్‌తో కలిసి ఉమ్మడిగా మోదీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.భారత్-ఈయూ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాన్ని నివారించడంలో సాయపడుతుందన్నారు. ఇది భారత్, యూరప్ ప్రజలకు అద్భుత అవకాశాలను కల్పిస్తుందని, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై మన నిబద్దతను మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు.


