జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్స ఎయిర్‌లైన్స్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న ఐదేండ్లలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. 2023 నాటికి 4,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. ఖర్చులను తగ్గించి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తన కార్యకలాపాల విస్తృత సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లుఫ్తాన్స తన ప్రకటనలో తెలిపింది. కాగా సంస్థ నిర్ణయంతో ఈ లేఆఫ్స్ ప్రధానంగా అడ్మినిష్టేటివ్ రోల్స్‌పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో దాదాపు 10,3000 మంది ఉన్నారు.


