రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పూర్తి సుముఖంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. పామ్‌బీచ్ లోని ట్రంప్ నివాసమైన మార్ ఎ లాగో లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. యుద్ధం ముగింపు కోసం ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికపై ఈ చర్చలు సాగాయి. ఈచర్చలు సంక్లిష్టమై, విఫలమై, కొన్నేళ్లుగా యుద్ధం కొనసాగుతోందన్నారు. అంతకు ముందు రష్యాఅధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో రెండున్నర గంటల సేపు మాట్లాడిన తరువాత ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.


