ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. ఈ లిక్కర్ స్కామ్లో ఆయన కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో హవాలా, మనీ ల్యాండరింగ్ రూపంలో భారీఎత్తున అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీకి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్టయ్యారు. అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలైన విషయం విదితమే.


