సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దాదాపు 80 ఏళ్ల తర్వాత సిరియా అధ్యక్షులు వైట్ హౌస్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయాన్ని సిరియా విదేశాంగ మంత్రి అసద్ అల్ – షైబానీ వెల్లడించారు. అధ్యక్షుడు అహ్మద్ అల్ – షరా పర్యటన బహుశా నవంబర్ 10 తేదీల్లో ఉండొచ్చని సిరియా అమెరికా ప్రత్యేక రాయబారి థామస్ బరాక్ తెలిపారు.బషర్ అల్- అసద్ ప్రభుత్వ కాలంలో సిరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలనే దానిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్‌తో సిరియా అధ్యక్షుడు చర్చలు జరపనున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్ అల్ షైబానీ తెలిపారు.


