కృత్రిమ మేధ ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియను ఆర్థికంగా ముందుకు సాగుతున్న దేశాలు సద్వినియోగం చేసుకోవచ్చునని గుగూల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ఏఐ హైపర్ ప్రోగ్రెస్‌ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలననేది మన చేతుల్లోనే ఉందన్నారు. డిజిటల్ డివైడ్, ఏఐ డివైడ్‌లతో ప్రపంచ సార్వత్రిక ప్రగతి కుంటుపడుతుందన్నారు. ఏఐ రాకతో అనివార్యంగా వర్క్‌ఫోర్స్ మార్పులు జరుగుతాయి. కొన్ని బాధ్యతలు యాంత్రికం అవుతాయి. పలు రంగాలలో వినూత్న కేరీర్‌లకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కలిసికట్టుగా వ్యవహరిస్తేనే ఏఐ సాంకేతికత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ దిశలో ప్రభుత్వాల పాత్ర కీలకమైనది అన్నారు. అవసరం అయిన నిబంధనలు, లక్షాలు నిర్ధేశించుకోవడం కీలకం అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఏఐకి అత్యధిక బడ్జెట్ కేటాయింపుల్లో తప్పేమీ లేదన్నారు.


