My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

62 ఏళ్ల సేవలకు గుడ్‌బై చెప్పిన వాయుసేన

 భారత వైమానిక దళం చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్‌ జెట్‌ మిగ్‌-21 శకం ముగిసింది. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత మిగ్‌ ఫైటర్‌ జెట్లు రిటైర్‌ అయ్యాయి. భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నముక వలే ఉండి, ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన ఈ ఫైటర్‌ జెట్స్‌కు చండీగఢ్‌ వాయుసేన కేంద్రం వేదికగా జరిగిన ఫేర్‌వెల్‌ కార్యక్రమంలో వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్‌  నేడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ […]

 భారత వైమానిక దళం చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్‌ జెట్‌ మిగ్‌-21 శకం ముగిసింది. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత మిగ్‌ ఫైటర్‌ జెట్లు రిటైర్‌ అయ్యాయి. భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నముక వలే ఉండి, ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన ఈ ఫైటర్‌ జెట్స్‌కు చండీగఢ్‌ వాయుసేన కేంద్రం వేదికగా జరిగిన ఫేర్‌వెల్‌ కార్యక్రమంలో వాయుసేన చీఫ్‌ ఏపీ సింగ్‌  నేడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు సీనియర్‌ అధికారులు, మాజీలు హాజరయ్యారు. మిగ్‌-21 ఫైటర్‌ జెట్స్‌  1963లో ఐఏఎఫ్‌లో చేరాయి. భారత వైమానిక దళం ఫైటర్ జాబితాలో మొట్టమొదటి సూపర్‌సోనిక్ విమానం. అప్పటి నుంచి మిగ్‌-21 యుద్ధ విమానాలు భారత్‌కు వెన్నెముకగా నిలిచాయి. 1965, 1971లలో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలు, 1999లో కార్గిల్‌ యుద్ధం, 2019లో బాలాకోట్‌ దాడులు, ఆపరేషన్‌ సిందూర్‌ సహా అనేక కీలక ఆపరేషన్లలో ముఖ్య పాత్ర పోషించాయి. వేగం, చురుకుదనం, పోరాట పటిమతో ఈ విమానం భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయాలు సాధించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.