My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము

గతేడాది అహ్మదాబాద్‌లో భయంకర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము తాజాగా లభించింది. విమానం పూర్తిగా ధ్వంసం కావడంతో రీ-ఇన్సూరర్లు, బీమా సంస్థలు 125 మిలియన్ డాలర్ల బీమా మొత్తాన్ని ఎయిరిండియాకు […]

గతేడాది అహ్మదాబాద్‌లో భయంకర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము తాజాగా లభించింది. విమానం పూర్తిగా ధ్వంసం కావడంతో రీ-ఇన్సూరర్లు, బీమా సంస్థలు 125 మిలియన్ డాలర్ల బీమా మొత్తాన్ని ఎయిరిండియాకు చెల్లించాయి. అలాగే ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు మరో 25 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని బీమా సంస్థలు తెలిపాయి. అయితే ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, పరిహారం మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించాయి. ఈ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు టాటా గ్రూపు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారి బంధువులకు పరిహారం ఇవ్వడంతో పాటు, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, మెడికల్ కాలేజ్ హాస్టల్ పునరుద్ధరణ, విమాన శకలాల వల్ల దెబ్బ తిన్న ఇతర నిర్మాణాలను పునరుద్ధరించడం వంటి పనులను ఈ ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.