నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం అఖండ 2 తాండవం. మేకర్స్ తాజాగా సినిమా ప్రీ-రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28న, హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించబోతున్నారు.సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుండగా, ఫ్యాన్స్ భారీగా హాజరు కానున్నారని అంచనా. బాలకృష్ణ ఉ బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ ఈవెంట్లో పెద్ద సర్ప్రైజ్లు ఉంటాయని టాక్. కొత్త ట్రైలర్ లేదంటే కొత్త యాక్షన్ షూట్ ఫుటేజ్ , అవి లేకపోతే ప్రత్యేక అనౌన్స్మెంట్ ఏదో ఒకటి ఉంటుందని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు . సినిమా పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది


