ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట వెడ్డింగ్ సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ కుమారుడు, టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ -నయానికా రెడ్డి వివాహం మార్చి 6న జరగనుంది. అల్లు వారి ఇంట ఇప్పటికే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అల్లు ఫ్యామిలీ సంప్రదాయబద్దంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిస్తూ అందరినీ వివాహానికి ఆహ్వానిస్తుంది.
తాజాగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆన్నా లెజ్నేవాకు పెళ్లి శుభలేఖను అందజేసి ఆహ్వానించారు.పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, ఆయన భార్య పద్మజను కూడా శిరీష్ దంపతులు కలిసి వివాహానికి రావాలని కోరారు. ఇప్పటికే చిరంజీవి, సురేఖ దంపతులను వెడ్డింగ్ ఇన్విటేషన్ అందజేసింది అల్లు అరవింద్ ఫ్యామిలీ.


