అంతర్జాతీయ ఆప్టికల్ దిగ్గజం జెడ్ఈఐఎస్ఎస్ తాజాగా హైదరాబాద్‌లో మరో ఎక్సలెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది 4.500 చదపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్‌తో నూతన పరిశోధనలు గావించడానికి వినియోగించనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0 ఒకదానికొకటి ముడిపడివున్నాయి. హైదరాబాద్‌లో ఏరోస్పేస్ రంగం వేగవంతంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, అలాగే మెడికల్ పరికరాల తయారీ హబ్‌గా మారిందని చెప్పారు.


