రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం. ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అప్పలసూరి అనే కీలక పాత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోస్టర్‌లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది ఫ్యాన్స్ ముక్కున వేలేసుకున్నారు. తర్వాత అది జగపతి బాబు అని తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు. స్టైలిష్, పవర్‌ఫుల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు, ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన అవతారంలో దర్శనమివ్వబోతున్నారు.
పెద్ది సినిమాలో అప్పలసూరి పాత్ర కోసం జగపతి బాబు పూర్తిగా తన రూపాన్ని మార్చుకున్నట్లు ఈ ఫస్ట్ లుక్ స్పష్టంగా చెబుతోంది. గడ్డం, రఫ్ లుక్, కళ్లలో కనిపించే ఇంటెన్సిటీతో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో తనకు సరిపోయే బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జగపతి బాబు, ఈ సినిమాలో మరో మాస్టర్‌క్లాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని టాక్. పెద్దిలో అప్పలసూరిగా అద్భుతమైన జగపతి బాబు. ఓ బలమైన, ప్రభావవంతమైన పాత్రలో అతని మాస్టర్‌క్లాస్ పర్ఫార్మెన్స్ చూడటానికి సిద్ధంగా ఉండండి. పెద్ది మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


