తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. ఈ విషయాన్ని భువనేశ్వరి తెలియజేశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్, కుటుంబసమేతంగా కలవడం సంతోషం కలిగించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన చూపిన అభిమానం మరువలేనిది. ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని భువనేశ్వరి పేర్కొన్నారు.


