తెలంగాణలో మున్సివల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది. ఈ నెల 13న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 13న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 136 కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక జరుగుతుంది. అదే రోజున కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్‌లకు ఎన్నిక జరుగుతుంది.


