యూకేలోని లూటన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. మహిళలు, చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారులు సంప్రదాయ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలంతా తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా బతుకమ్మలను పేర్చిన వారందరికీ బహుమతులను అందజేశారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.


