పేదరిక నిర్మూలన అంటే కేవలం ఆర్థిక సాయం చేయడం కాదని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం, ఎదగడానికి అవకాశాలను కల్పించడమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సంద్భంగా చంద్రబాబు స్పందించారు. పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం తొలిరోజు నుంచి పనిచేస్తోందన్నారు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అలాగే పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.


