వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియకు సర్కార్ అంగీకారం తెలిపింది. కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ స్కాంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్‌లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ తేల్చింది. సిట్ దర్యాప్తు నివేదిక, విన్నపం మేరకు చెవిరెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేరిట ఉన్న ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. కెవీఎస్ ఇన్ ఫ్రా ఎండీగా ఉన్న చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరిట ఆస్తులతో పాటు.. సీఎంఆర్ ఇన్ ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను అటాచ్మెంట్ చేయనున్నారు.


