బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీకి గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డేయే కూటమి 202 స్థానాల్లో జయభేరి మోగించింది. ఇక అధికారంలోకి రావాలనుకున్న ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘఠ్‌బంధన్ కూటమి ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. ఆయన కుమార్తె రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, కుటంబంతో సంబంధాలను కూడా తెంచుకుంటున్నట్లు వెల్లడించారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. అలాగే నేను నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నాను. ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాభవం వేళ రోహిణి ఆచార్య ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.


