తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన హాస్య బ్రహ్మా బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రహ్మానందాన్ని ఆప్యాయంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి, శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రతిగా బ్రహ్మానందం తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి పెన్సిల్ ఆర్ట్ చిత్రాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. ఈ ప్రత్యేకమైన బహుమతి రాష్ట్రపతిని ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈ భేటీ వెనుక ఉన్న అసలు కారణాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇద్దరూ కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించినట్లు సమాచారం.


