My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

తహవ్వుర్ రాణాకు కెనడా షాక్

కెనడా ప్రభుత్వం ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ  భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తహవ్వుర్‌ రాణా ప్రస్తుతం భారత్‌లో ఎన్‌ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. కాగా 1997లో రాణా కెనడాకు వలస వెళ్లాడు. 2001లో ఇమిగ్రేషన్‌, రెఫ్యూజిస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా అతడికి కెనడా పౌరసత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ […]

కెనడా ప్రభుత్వం ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ  భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

తహవ్వుర్‌ రాణా ప్రస్తుతం భారత్‌లో ఎన్‌ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నాడు. కాగా 1997లో రాణా కెనడాకు వలస వెళ్లాడు. 2001లో ఇమిగ్రేషన్‌, రెఫ్యూజిస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా అతడికి కెనడా పౌరసత్వం ఇచ్చింది. ఇప్పుడు ఆ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ఐఆర్‌సీసీ చర్యలు ప్రారంభించింది. దీనికి కారణం అతడిపై ఉన్న ఉగ్ర ఆరోపణలు కాదని, తప్పుడు పత్రాలతో పౌరసత్వం పొందడంపై ఈ చర్యలు చేపట్టామని వివరించింది. పౌరసత్వం కోసం రాణా దరఖాస్తు చేసుకున్న సమయంలో తాను టొరంటో నివాసినని పేర్కొన్నాడు. కానీ, ఆ సమయంలో అతడు షికాగోలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కొన్నేళ్లుగా దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై తహవ్వుర్‌ 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని యూఎస్‌ అధికారులు గతేడాది భారత్‌కు అప్పగించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.