టాలీవుడ్ మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన కొణిదెల దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక మగ శిశువుకు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో కొణిదెల కుటుంబం, కామినేని కుటుంబం ఆనందంలో మునిగిపోయాయి. మెగా అభిమానులు డబుల్ జాయ్ అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.


