యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో 105 వైఐఐఆర్ఎస్ లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికి మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఐఐఆర్ఎస్ లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని వివరించారు. వైఐఐఆర్ఎస్ ల నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి తెలిపిన సీఎం విన్నవించారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు.


