సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన స్వగ్రామం నారా వారి పల్లికు చేరుకున్నారు. రాజధాని అమరావతి నుంచి హెలికాఫ్టర్లో ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు జిల్లా ఉన్నతాధికారుల తోపాటు స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఈ గ్రామానికి చేరుకున్నారు.
నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ సైతం ఇప్పటికే నారా వారి పల్లికు విచ్చేసింది. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖ ఎంపీ ఎం. భరత్ సైతం నారా వారి పల్లికు చేరుకున్నారు. నారా, నందమూరి ఫ్యామిలీలు చేరుకోవడంతో.. సీఎం స్వగ్రామం నారా వారి పల్లికు కొత్త శోభ వచ్చింది. ప్రతి ఏటా సంక్రాంతి పండగను నారా, నందమూరి ఫ్యామిలీలు ఈ నారా వారి పల్లిలో జరుపుకోవడం అనవాయితీగా వస్తుంది. ఈ పండగ సందర్భంగా గ్రామ దేవత నాగాలమ్మను ఈ ఇరు కుటుంబాలు దర్శించుకోని ప్రత్యేక పూజలు చేయనున్నాయి. అలాగే చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులను సైతం సందర్శించుకొని వారికి ఘనంగా నివాళులర్పించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనతో నేపథ్యంలో ఆయన స్వగ్రామంతోపాటు పరిసర గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.


