My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News - NRI

ప్రవాసాంధ్ర భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రవాసాంధ్ర భరోసా  పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో ప్రారంభించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం,  అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందించనుంది. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు,  విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగులు, వలస కార్మికులు, […]

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రవాసాంధ్ర భరోసా  పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో ప్రారంభించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం,  అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందించనుంది. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు,  విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance  వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. మరిన్ని వివరాల కోసం 24/7 అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నెంబర్ 8632340678, వాట్సాప్ నెంబర్ 8500027678లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకే వీలు కల్పించింది సర్కార్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.