మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకు న్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిఎం ఓటు వేశారు. మధిర మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది.


