My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

బుకర్‌ ప్రైజ్‌ విజేతగా డేవిడ్‌ సలై

కెనడియన్‌-హంగరియన్‌-బ్రిటిష్‌ రచయిత డేవిడ్‌ సలై ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ గెలుపొందారు. తన రచించిన ఫ్లెష్‌ నవలకుగానూ ఈ అవార్డు దక్కింది. సుదీర్ఘంగా సాగే ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ నవల ప్రత్యేక ఏంటంటే రచయిత కొన్ని లైన్ల మధ్య ఖాళీ ఉంచాడు. పాఠకుడు ఆ వ్యక్తికి లోతైన భావాలు, సంఘర్షణలు ఊహించాల్సి ఉంటుంది. అయితే ఆ ఖాళీలు వ్యక్తి జీవితంలో ఏం జరిగి ఉంటుందో తెలిసేలా సులభంగానే రచయిత రూపకల్పన చేశారు. 51 ఏండ్ల […]

కెనడియన్‌-హంగరియన్‌-బ్రిటిష్‌ రచయిత డేవిడ్‌ సలై ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ గెలుపొందారు. తన రచించిన ఫ్లెష్‌ నవలకుగానూ ఈ అవార్డు దక్కింది. సుదీర్ఘంగా సాగే ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ నవల ప్రత్యేక ఏంటంటే రచయిత కొన్ని లైన్ల మధ్య ఖాళీ ఉంచాడు. పాఠకుడు ఆ వ్యక్తికి లోతైన భావాలు, సంఘర్షణలు ఊహించాల్సి ఉంటుంది. అయితే ఆ ఖాళీలు వ్యక్తి జీవితంలో ఏం జరిగి ఉంటుందో తెలిసేలా సులభంగానే రచయిత రూపకల్పన చేశారు. 51 ఏండ్ల డేవిడ్‌ సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించి బుకర్‌ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. దీంతో అవార్డు గెలుచుకున్న డేవిడ్‌కు రూ.50,000 పౌండ్లు దక్కనున్నాయి. మొత్తం 153 నవలలు ఈ ప్రైజ్‌ కోసం పోటీ పడగా ఐరిష్‌ రచయిత రాడీ డోయల్‌, సారా జెస్సీకా పార్కర్‌లతో కూడిన న్యాయనిర్ణేతలు డైవిడ్‌ రాసిన ఫ్లెష్‌ ను ఎంపిక చేశారు. ఇందుకోసం జడ్జిలు ఐదుగంటలు సమావేశమయ్యారు. అనంతరం ఏకగ్రీవంగా దీన్ని ఎంపిక చేశారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.