తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ మలేషియా శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించింది. లైట్ హౌస్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో జరిగిన కార్య క్రమంలో బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతీ కురుమ మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో చేపట్టిన దీక్షతో రాష్ట్ర సాధన సాధ్యమైందని అన్నారు. ఈ సందర్భం గా లైట్‌హౌస్ చిల్డ్రన్స్ వెల్ఫేర్ హోమ్‌లో నిత్యావసర వస్తువులు, పలు రకాల పండ్లను అందజేశారు.
ఈ కార్యక్రమములో బీఆర్ఎస్ మలేషియా ఫౌండర్ చిట్టిబాబు చిరుత , కోర్ కమిటీ సభ్యులు అరుణ్ , సందీప్ కుమార్ లగిశెట్టి, హరీష్, సురేష్, ములకల శ్రీనివాస్, శశి కుమార్, సందీప్ గౌడ్, సత్య తదితరులు పాల్గొన్నారు.


