ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్‌పై ఎన్‌ఐఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో పోలీసులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ఓ సర్జన్‌ను పోలీసులు అరెస్టు చేయగా, పశ్చిమ బెంగాల్‌లో ఎంబీబీఎస్ స్టూడెంట్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి జనిసూర్ అలియాస్ నిసార్ ఆలంను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అరెస్టు చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. నిసార్ హర్యానాలోని అల్-ఫలా యూనివర్సిటీ విద్యార్థి కాగా, లూధియానాలో నివాసం ఉంటున్నాడు. అతని పూర్వీకుల ఇల్లు దల్ఖోలా సమీపంలోని కోనల్ గ్రామంలో ఉంది.


