ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై ది రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ వేసిన చార్జ్‌షీట్‌లో మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు కూడా క్లీన్చిట్ ఇచ్చింది. కవితతో పాటు 23 మంది నిందితులు తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ సవాల్ చేయనుంది.


