అమెరికా వేల సంఖ్యలో భారతీయుల్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్నారంటూ వారిని స్వదేశానికి వెళ్లగొట్టింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే, అత్యధికంగా భారతీయుల్ని బహిష్కరించింది అమెరికా కాదని కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది ఎక్కువ మంది భారతీయుల్ని బహిష్కరించిన దేశం సౌదీ అరేబియా అని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలే రాజ్యసభ కు వివరాలు వెల్లడించింది. ఆ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ ఏడాది (2025) మొత్తం 81 దేశాలు 24,600 మందికిపైగా భారతీయుల్ని బహిష్కరించాయి. అందులో అత్యధికంగా సౌదీ అరేబియా తొలిస్థానంలో నిలిచింది. 12 నెలల్లో సౌదీ అరేబియా 11 వేల మందికంటే ఎక్కువ మంది భారతీయుల్ని దేశం నుంచి వెళ్లగొట్టింది. ఆ తర్వాత అమెరికా 3,800 మంది భారతీయుల్ని డిపోర్ట్ చేసింది. అమెరికాలో గత ఐదేళ్లలో ఇదే అత్యధిక బహిష్కరణలు. వాషింగ్టన్ డీసీ నుంచే 3,414 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారు.


