మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. వీటినే సూక్ష్మ పోషకాలు అని కూడా అంటారు. అంటే మెగ్నిషియం మనకు చాలా స్వల్ప మోతాదులో అవసరం అవుతుందన్నమాట. ఇతర పోషకాల్లాగే మెగ్నిషియం కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో అనేక జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడాలంటే అందుకు మెగ్నిషియం అవసరం అవుతుంది. మెగ్నిషియం ఉన్న ఆహారాలను రోజూ తీసుకుంటే మనకు అనేక లాభాలు కలుగుతాయి. వీటిని తినడం వల్ల పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. మెగ్నిషియం మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
మెగ్నిషియం మనకు పలు ఆహారాల్లో లభిస్తుంది. మెగ్నిషియం మనకు పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకులు, బచ్చలికూర, బాదంపప్పు, వాల్ నట్స్, జీడిపప్పు, పిస్తా, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్, అవకాడో, అరటి పండ్లు, డార్క్ చాకొలేట్, చేపలు, చీజ్, పప్పు దినుసులు వంటి అనేక ఆహారాల్లో లభిస్తుంది. ఈ ఆహారాలను రోజూ తింటుంటే మెగ్నిషియం సరిగ్గా లభిస్తుంది. దీంతో ఆయా అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు.


