అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. ఫ్రాన్స్పై భారీగా సుంకాలు విధిస్తానని బెదిరింపులకు దిగారు. గాజా పునర్నిర్మాణం కోసం ఆయన ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడానికి ఫ్రాన్స్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్, ఆదేశంపై టారిఫ్స్ బాంబ్ పేల్చారు. ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వైన్, షాంపైన్లపై ఏకంగా 200 శాతం టారిఫ్ విధిస్తానని బెదిరింపులకు దిగారు. అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ ఖచ్చితంగా దారికి వస్తాడని, బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరుతాడని వ్యాఖ్యానించారు.


