My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

జెలెన్‌స్కీ తో డొనాల్డ్‌ ట్రంప్ భేటీ

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో ట్రంప్‌ భేటీ అయ్యారు. తోమహాక్‌ క్షిపణులు, ఇతర ఆయుధాల కోసం జెలెన్‌స్కీ అమెరికా చేరుకున్నారు. వైట్‌హౌస్‌  లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. అదేవిధంగా ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని ఈ సందర్భంగా ట్రంప్‌ పిలుపునిచ్చారు. జెలెన్‌స్కీతో సమావేశం చాలా ఆసక్తికరంగా, స్నేహపూర్వకంగా జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఈ యుద్ధంలో […]

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తో ట్రంప్‌ భేటీ అయ్యారు. తోమహాక్‌ క్షిపణులు, ఇతర ఆయుధాల కోసం జెలెన్‌స్కీ అమెరికా చేరుకున్నారు. వైట్‌హౌస్‌  లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. అదేవిధంగా ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని ఈ సందర్భంగా ట్రంప్‌ పిలుపునిచ్చారు. జెలెన్‌స్కీతో సమావేశం చాలా ఆసక్తికరంగా, స్నేహపూర్వకంగా జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్‌ గుర్తు చేశారు. ఇక దీన్ని ముగించి శాంతి నెలకొల్పాలని పుతిన్‌, జెలెన్‌స్కీని కోరినట్లు వెల్లడించారు. ఇకపై కాల్పులు, మరణాలు, అనవసరమైన భారీ ఖర్చులు వద్దు. నేను అప్పుడే అధ్యక్షుడిగా వుండి ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.