అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మోత మోగించారు. తమ దేశంలోకి వచ్చే అన్ని బ్రాండెడ్, పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్స్ దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి 100 శాతం సుంకాలుంటాయని ప్రకటించారు. దీంతో భారతీయ ఫార్మా రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మెజారిటీ ఔషధ తయారీ సంస్థలకు అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయమే కీలకం. ఇప్పుడీ సుంకాలు దానికి గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి. విదేశీ సంస్థలు అమెరికాలో ఏర్పాటు చేసిన తమ ప్లాంట్లలో ఔషధాలను తయారుచేస్తే, లేదా అమెరికాలో ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నాగానీ ఆయా సంస్థల ఉత్పత్తులపై ఈ సుంకాలు ఉండబోవని ట్రంప్ తెలిపారు. కాగా, భారీ ట్రక్కుల దిగుమతిపై 25 శాతం, కిచెన్ క్యాబినెట్, బాత్రూం వానిటీలపై 50 సుంకాలు పడనున్నాయి.


