ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్‌కు యూరోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌పై 120 మిలియన్ యూరోల జరిమానా విధించింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం నియమాలను ఉల్లంఘించిందని విచారణలో తేలడంతో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌లో డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద ఒక ప్లాట్‌ఫామ్‌పై నిబంధనలు పాటించడం లేదంటూ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. డీఎస్‌ఏ సోషల్ మీడియా కంపెనీలను యూజర్ల సెక్యూరిటీని నిర్ధారించాలని, తప్పుడు సమాచారం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని నిబంధనలు చెబుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే గణనీయమైన జరిమానాలు విధిస్తారు.


