గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గ్రీన్‌లాండ్ విషయంలో తమకు సమర్థించని యూరప్ దేశాలపై 10 శాతం సుంకం విధిస్తామని చేసిన ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జూలైలో ప్రకటించిన యూఎస్ – ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని యూరోపియన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు సిగ్‌ఫ్రిడ్ మురెసాన్ వెల్లడించారు.
గత ఏడాది జూలైలో కుదిరిన యూఎస్-ఈయూ వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే రాటిఫై చేయాల్సి ఉంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి ఈయూకు వచ్చే దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించే అవకాశం ఉండేది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాల్సి వస్తుంది అని సిగ్‌ఫ్రిడ్ మురెసాన్ తెలిపారు.


