బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అసత్యాలేనని విమర్శించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టారని, అయిన 90 శాతం పనులు కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టిందని ఆరోపించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరేన్స్ రాలేదని చెప్పుకొచ్చారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా మహబూబ్ నగర్ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు.


