త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పార్టీల్లో ఉత్సాహం పెరిగింది. ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో బిజీగా మారిపోయాయి. ఈ క్రమంలో బీజేపీ సైతం గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ ని బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. దర్భంగా ప్రాంతంలోని అలీఘర్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. బీహార్ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందు మైథిలి ఠాకూర్, బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌లను కలిశారు.


