My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

ఘోర ప్రమాదం.. బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు

కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు చోటుచేసుకుంది. గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలిలో శరీరభాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు శబ్దాలు […]

కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు చోటుచేసుకుంది. గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలిలో శరీరభాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.

పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రయివేటు పాఠశాలలో శ్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 2 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం. బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పరిమితికి మించి బాణసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.