పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని త్వరలోనే భారత్‌కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బ్రిటన్ అధికారులు వచ్చే నెల అంటే నవంబర్ 23న నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించనున్నట్లు తెలిసిందే. అతన్ని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచనున్నట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోడీదాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే అతను విదేశాలకు పారిపోయాడు.


