కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా తొలి 20టీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మ్యాచ్ను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు వెల్లడించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. వర్షం మ్యాచ్కు రెండుసార్లు అంతరాయం కలిగించింది. ఐదు ఓవర్ల తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత అంపైర్లు రెండు ఓవర్లు కుదించి.. 18 ఓవర్ల మ్యాచ్ ఆడించాలని నిర్ణయించారు. తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. భారత్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. మరోసారి భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి మ్యాచ్ను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్ను అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.


