తెలంగాణలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ షో జరుగనుంది. తెలంగాణ పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోను ప్రారంభించారు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న 300 మంది సందర్శకులకు హాట్ ఎయిర్ బెలూన్లలో రైడ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే సాధారణ ప్రేక్షకులకు నైట్ గ్లో షో ఓపెన్‌గా ఉండనుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ టికెట్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. వయస్సు, రైడ్ రకాన్ని బట్టి ధరలు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉండనున్నాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్స్ ఫెస్టివల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.


