భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కు అరుదైన గౌరవం లభించింది. నిరుడు టీమిండియాకు పొట్టి వరల్డ్ కప్ అందించిన హిట్‌మ్యాన్‌ను ఐసీసీ అంబాసిడర్‌గా నియమించింది. టీ20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, ఈ టోర్నికి రోహిత్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ ఛైర్మన్ జై షా అధికారికంగా ప్రకటించారు. దాంతో, వచ్చే ఏడాది స్వదేశంలో, శ్రీలంక వేదికగా జరుగబోయే ఈ మెగా ఈవెంట్ ప్రమోషన్స్‌లో రోహిత్ పాల్గొననున్నాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ పోటీలకు ప్రచారకర్తగా రోహిత్ శర్మ పేరును ప్రకటిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. నిరుడు టీమిండియాను విజేతగా నిలిపడంతో పాటు తొమ్మిది సీజన్లు ఆడిన రోహిత్ కంటే ఉత్తమ ప్రతినిధి మరొకరు లేరు అని ఐసీసీ అధ్యక్షుడు జై షా పేర్కొన్నాడు.


