గత వైసీపీ పాలనలో జీజీహెచ్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ నగరంలో ఏ రోడ్లు చూసిన గుంతలుగా ఉండేదని విమర్శించారు. ఎక్కడ చూసినా, ఏదో ఒక సమస్య ఉన్న నగరాన్ని ఏడాది క్రితం తమకు అప్పగించారని తెలిపారు. నగరంలో ఉన్న సమస్యలు పరిష్కరించాడనికి ఏడాది సమయం పట్టిందని పేర్కొన్నారు. గుంటూరు నగరం అభివృద్ధికి పంచ సూత్రాలు పెట్టుకొని పాలన అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. జీజీహెచ్‌లో 8 లిఫ్ట్‌లు ఉంటే 5 పని చేసేవికావని గుర్తు చేశారు. గత వైసీపీ హాయాంలో సమయానికి వైద్యులు అందుబాటులో ఉండే వారు కాదని మండిపడ్డారు. సిటీ స్కాన్‌లు పని చేసేవి కావు, రక్త పరీక్షలు బయటకు రాసేవారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జీజీహెచ్‌లో మెరుగైన సేవలు అందిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.


